Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడి చేద్దాం: మంత్రి పేర్ని నాని

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (21:59 IST)
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ రంజాన్ మాసంలో సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని, రంజాన్ మాసంలో ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ముస్లిం సోదరులను అభ్యర్ధించారు. 

శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మల్కా పట్నం పరిసర ప్రాంతంలో  లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 250 మంది పేదలకు రంజాన్ తోఫా నేషనల్ గోల్డ్ బాషా  ఆధ్వర్యంలో మంత్రి పేర్ని నాని  చేతుల మీదుగా అందచేశారు.

ఈ నెలాఖరున జరిగే రంజాన్ పండుగ రోజున ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సంతోషంగా సేమియా చేసుకోవడానికి అవసరమయ్యే  సేమియా, నేతి ప్యాకెట్ , పంచదార , కిస్ మిస్ , జీడిపప్పు అందచేసిన బాషా మంచి మనస్సును అల్లా దీవిస్తారని మంత్రి పేర్ని నాని అన్నారు.

ఈ రంజాన్ తోఫా కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ అచ్చాబా , 19 వ వార్డు ఇంచార్జీ బూరుగ  రామారావు, షేక్ జిలాని బాషా, మాజీ కౌన్సిలర్ మేడికొండూరు మధు తదితరులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments