ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల ఎస్పీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రబాబు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా దాచేపల్లి వంటి దారుణ ఘటనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల ఎస్పీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రబాబు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా దాచేపల్లి వంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుకండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెండేళ్ల వయసున్న చిన్నారులపై బంధువులు, తెలిసినవారే అత్యాచారాలకు పాల్పడుతుండటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఇలాంటి దారుణాలు జరగడానికి పోర్న్ వీడియోల ప్రభావమేనన్నారు. టెక్నాలజీని తప్పుడు మార్గంలో వినియోగిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
బాలికలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడుతున్నవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కాలంలో నేరాలు కొత్తకొత్త విధానాల్లో జరుగుతున్నాయని... నేరాల తీరును గమనిస్తూ, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పారు బెట్టింగ్ మాఫియాను టెక్నాలజీ సాయంతో అరికట్టాలని ఆయన సూచన చేశారు.