Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం పెళ్లి చేసుకుందాం అని ఎన్టీఆర్ నన్నడిగారు... లక్ష్మీ పార్వతి

రాంగోపాల్ వర్మ తీస్తానంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపైన ఒకవైపు చర్చ జరుగుతూనే వుంది. ఇదిలావుంటే తాజాగా స్వర్గీయ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో పెళ్లికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ఎన్టీఆర్ తన పట్ల

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (19:36 IST)
రాంగోపాల్ వర్మ తీస్తానంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపైన ఒకవైపు చర్చ జరుగుతూనే వుంది. ఇదిలావుంటే తాజాగా స్వర్గీయ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో పెళ్లికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ఎన్టీఆర్ తన పట్ల ఆకర్షితులవడానికి తనేమీ పెద్ద అందగత్తెనేమీ కాదనీ, కేవలం ఆత్మీయతే తామిద్దరిని కలిపిందని చెప్పుకొచ్చారు. 
 
ఎన్టీఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక’ చిత్రం షూటింగ్ జరుగుతుంటే తను ఆ షూటింగ్ స్పాటుకు వెళ్లాననీ, అక్కడ ఎన్టీఆర్‌తో పాటు లక్ష్మిగారు కూర్చుని వున్నట్లు చెప్పారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ వద్ద శెలవు తీసుకుంటూ ఇక నేను వెళ్లొస్తానని చెప్పగానే మళ్లీ ఎప్పుడు వస్తారు అని అడిగారనీ, ఆ మాటతో ఆయనలో తన పట్ల వున్న ఆత్మీయత వెల్లడైందన్నారు.
 
అలా తమ మధ్య మొదలైన అనుబంధం క్రమేపీ బలపడిపోయిందనీ, నరసరావుపేటలో తను నివాసముంటున్న ఇంటికి ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ పెట్టించి దాని బిల్లు రూ.3 లక్షలు ఆయనే కట్టారని గుర్తు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆయన తన పట్ల ఎంత ప్రేమను చూపించారో అర్థమవుతుందనీ, అలా ఒకరోజు తనను పెళ్లాడుతానంటూ ఆయనే స్వయంగా ప్రపోజ్ చేశారని చెప్పారు. ఐతే కొద్ది సమయం కావాలని చెప్పి ఆ తర్వాత తన మొదటి భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ఎన్టీఆర్‌కు చెప్పినట్లు లక్ష్మీపార్వతి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments