కర్ణాటక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో లగడపాటి చెప్పిన సర్వే చూస్తే షాకే..

ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు బిజెపి, మరోవైపు కాంగ్రెస్, జెడిఎస్‌లు మూడు కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే గెలుపు ఎవరిదన్నది మాత్రం త్వరలోనే తేలనుంది. కానీ ఇంతలోనే సర్వేలు రాజకీయ నేతల్లో గుబులు పుట్ట

Webdunia
గురువారం, 10 మే 2018 (18:35 IST)
ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు బిజెపి, మరోవైపు కాంగ్రెస్, జెడిఎస్‌లు మూడు కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే గెలుపు ఎవరిదన్నది మాత్రం త్వరలోనే తేలనుంది. కానీ ఇంతలోనే సర్వేలు రాజకీయ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపినే కర్ణాటక రాష్ట్రంలో గెలుస్తుందని ధీమాతో ఉండగా, మోడీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమకు పీఠం వచ్చేలా చేస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు జెడిఎస్ కూడా గెలుపు ధీమాలో ఉంది. 
 
ఇలా ఎవరికి వారు గెలుపు ధీమాలో ఉండగా లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన సర్వే చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 225 సీట్లు ఉండగా అందులో 110 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, 80 స్థానాలను బిజెపి గెలుస్తుందని, మిగిలినది జెడిఎస్ సాధిస్తుందని సర్వేలో తెలిపారు. గతంలో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన సర్వేలు నిజమయ్యాయి. దీంతో ఈ సర్వే కూడా అలాగే ఉంటుందనే అంచనాకు వచ్చారు రాజకీయ విశ్లేషకులు. 
 
నాలుగేళ్ళ మోడీ పాలనలో దేశ ప్రజలు విసిగివేసారి పోయారని, అందుకే బిజెపి నేతలకు దిమ్మ తిరిగే షాక్ కర్ణాటక ప్రజలు ఇస్తారని చెబుతోంది లగడపాటి సర్వే. అయితే సర్వేలన్నింటినీ బిజెపి కొట్టి పారేస్తోంది. సర్వేలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. దేశంలో మోడీ గాలి వీస్తోందని, కాబట్టి ఖచ్చితంగా బిజెపినే గెలుస్తుందంటున్నారు ఆ పార్టీ నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments