Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొట్టు.. గోరింటాకు పెట్టుకుని వస్తే ఫైన్ : ప్రిన్సిపాల్ హెచ్చరిక

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (10:23 IST)
ఏపీలోని కర్నూలులో కొందరు ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్నూలులోని డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలో పలువురు విద్యార్థినులకు శిక్షణ ఇచ్చే ఒక ప్రిన్సిపాల్ వింత హెచ్చరికలు చేశారు. నుదుట బొట్టు, చేతులకు గోరింటాకు పెట్టుకుని వస్తే అపరాధం  విధిస్తానని హెచ్చరించారు. పైగా, అమ్మాయిలతో వ్యక్తిగత సేవలు కూడా చేయించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే ఫెయిల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌గా శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం ఉంది. ఈ కోర్సుకు ప్రిన్సిపల్ వార్డెన్‌గ్ విజయ సుశీల వ్యవహరిస్తున్నారు. 
 
ఈమె విద్యార్థినులను నిత్యం వేధిస్తుండటమే కాకుండా, బొట్టు, గొరింటాకు పెట్టుకుని వస్తే విద్యార్థినులకు జరిమానా విధిస్తున్నారు. దీంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు వ్యక్తిగత సేవలన్నీ చేయంచుకుంటున్నారు. చేయనని ఎవరైనా మొండికేస్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారు. 
 
ప్రిన్సిపాల్ వేధింపులు ఎక్కువ కావడంతో ఇద్దరు విద్యార్థినులు వసతి గృహంలో ఫ్యానుకు ఉరేసుకునేందుకు యత్నించారు. బాధితులు సోమవారం తమ సమస్యను ప్రాంంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మీనర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విజయ సుశీలను పిలిచి గట్టిగా మందలించారు. తనపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన విజయ సుశీల.. గతంలో తాను విద్యార్థినుల వద్ద తీసుకున్న లేఖలను బూచిగా చూపి తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో శనివారం మరో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. దీంతో సెలవులు ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపించేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments