కుమారుడిని సంసారానికి పనికిరాకుండా చేసిందనీ కోడలు హత్య?

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (16:59 IST)
కర్నూలు జిల్లాలో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు కలకలం రేపాయి. తల్లీ కుమార్తెను గుర్తు తెలియని దండగులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక భవనంలోని పై అంతస్తులో తల్లిని, కింది అంతస్తులో కుమార్తెను హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 
 
అలాగే, హత్యకు గురైన వారిని రుక్మిణి, రమాదేవిలుగా గుర్తించారు. కాగా, ఈ జంట హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర రావుకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈయన కోలుకుంటేగానీ ఈ హత్యలకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. 
 
కాగా, కర్నూలుకి చెందిన శ్రావణ్‌కు రుక్మిణిని ఇచ్చి వివాహం చేసారు. హైదరాబాద్ నగరంలో బ్యాంకు ఉద్యోగం చేస్తూ వచ్చిన శ్రవణ్‌కు ఆపరేషన్ తర్వాత వివాహమైంది. దీంతో తన కుమారుడిని సంసారానికి పనికిరాకుండా చేశావంటూ కక్షగట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్.. కోడలు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిలను హత్య చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dixit Shetty: ప్రేమ కథని మరో కోణంలో చూపించే ది గర్ల్ ఫ్రెండ్ - దీక్షిత్ శెట్టి

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments