Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో వేటకొడవలితో భార్యను నరికి... భుజాన వేసుకుని...

కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (12:53 IST)
కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌కు చెందిన తెలుగు నాగన్న కుమార్తె మహేశ్వరి (33) సంవత్సరాల క్రితం బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటకు చెందిన పెద్ద పుల్లన్న కుమారుడు లింగమయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. ముగ్గురు పిల్లలు జన్మించిన తర్వాత కూడా గొడవలు ఆగలేదు. దీంతో భార్య అలంపూర్‌ కోర్టులో భర్తపై (మెయింటెనెన్స్‌) నిర్వహణ ఖర్చులు చెల్లించాలని దావా వేసింది. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. 
 
అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగగా, లింగమయ్య భార్య పోషణకు నెల నెలా డబ్బు ఇవ్వాలనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బనగానపల్లెలోని తెలుగుపేటలో భర్త ఇంటి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ముగ్గురు పిల్లలను తన వద్దనే ఉంచుకొని టైలరింగ్‌ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా లింగమయ్య భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 
 
మహేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను వేటకొడవలితో నరికి చంపేశాడు. శవాన్ని భుజంపై మోసుకుంటూ వెళ్లి తన ఇంటి వద్ద పడేసి మెట్లపై కూర్చున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. భార్యను తానే చంపానని ఒప్పుకోవడంతో పోలీసులు లింగమయ్యను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments