Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలి పాలిట కట్టుకున్నవాడే కాలయముడు..

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో హతమార్చాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది.

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (15:51 IST)
కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో హతమార్చాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దకబేళా వీధిలో నివసిస్తున్న పర్వీన్‌ను, సున్నంబట్టీ కాలనీవాసి బాషాకిచ్చి నాలుగేళ్ల కిందట పెళ్లి చేశారు. బాషా సెంట్రింగ్‌ పనిచేస్తూ జీవిస్తున్నాడు. వారికి మూడేళ్ల పాప కూడా ఉంది. పర్వీన్‌ ప్రస్తుతం మూడునెలల గర్భిణి. పెళ్లైనప్పటి నుంచి అనుమానంతో భార్యను వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం దంపతులు బెంగళూరు, కేరళ ప్రాంతాలకు వెళ్లగా అక్కడ కూడా వేధింపులు తప్పలేదు. దీంతో తల్లిదండ్రులు బిడ్డను పుట్టింటికి తీసుకొచ్చుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో భార్యతో గొడవపడి గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. 
 
ఆమె అరుపులు విని తల్లిదండ్రులు రావడంతో బాషా అక్కడినుంచి పారిపోయి సంజీవయ్యనగర్‌ శివార్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన పర్వీన్‌ను ఎమ్మిగనూరు ఆసుపత్రికి, అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె కోలుకోలేక శనివారం కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments