Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. విశాఖకు సీఎం జగన్.. కేటీఆర్ ట్వీట్..

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (15:11 IST)
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం విశాఖపట్నం సిద్దమైంది. ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు.  
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం రాత్రి విశాఖ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటూ అక్కడే ఉంటారు. ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  
 
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో తొలి రోజు మార్చి 3న శుక్రవారం ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షత జీఐఎస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది.
 
ఇదిలా వుంటే.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 
 
ఇంకా తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్‌ ఆశించారు. ఈ సదస్సుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్‌కు ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులు, నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments