పురుగుల మందును సిరంజితో ఎక్కించుకుని.. ఆత్మహత్యాయత్నం!

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (13:31 IST)
కృష్ణా జిల్లా లింగగూడెం మాజీ సర్పంచ్, తెదేపా సీనియర్ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందును సిరంజితో ఎక్కించుకొని... బలవన్మరణానికి యత్నించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం మాజీ సర్పంచ్, తెదేపా సీనియర్ నాయకుడు మురూకుట్ల రామారావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందును సిరంజి ద్వారా శరీరంలోకి ఎక్కించుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఇరు పార్టీల నాయకులతో ఒప్పందం చేసుకొని... వైకాపా అభ్యర్థిని ఏకగ్రీవం చేశారు. ఒప్పందం మేరకు పంచాయతీ సర్పంచి పదవి తెదేపాకు కేటాయించాల్సి ఉంది. కానీ.. వైకాపా నాయకులు సర్పంచ్ అభ్యర్థితో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న రామారావు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు ప్రాథమిక రిపోర్టు తయారు చేసి.. పెనుగంచిప్రోలు స్టేషన్​కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments