Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు కాల్వలోకి దూసుకెళ్లి మహిళ మృతి .. నలుగురికి గాయాలు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (14:01 IST)
ఉయ్యూరు మండల కలవపాముల గ్రామం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు. ఈ ప్రమాదంలో గుడివాడకు చెందిన గౌరీ కుమారి 60 సంవత్సరాల మహిళ మృతి. 
 
కార్తీక మాసం నోము నిమిత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు గన్నవరం వెళ్లి నుంచి గుడివాడ తిరిగి వెళ్తున్న క్రమంలో కలవపాముల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి ఆదివారం రాత్రి 11 గంటలకు దూసుకుపోయింది.
 
ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న నలుగురిని కాపాడగా గౌరీ కుమారి మహిళను కాపాడే సమయానికి ఆలస్యం కావడంతో నీరు ఎక్కువగా తాగేసి మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. 
 
ఘటనా సమాచారాన్ని అందుకున్న గ్రామీణ ఎస్సై దుర్గ మహేశ్వరరావు ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఐపీసీ 304ఏ సెక్షన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ దుర్గా మహేశ్వరరావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments