Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరైన్ పోలీస్ అధికారులతో కృష్ణాజిల్లా ఎస్పి సమావేశం

Webdunia
గురువారం, 15 జులై 2021 (08:51 IST)
సముద్రతీర ప్రాంతంలో మెరైన్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎస్పీ వారితో సమావేశం నిర్వహించి, మెరైన్ పోలీస్ స్టేషన్ ల నందు పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఎంత మంది సిబ్బంది ఉన్నది, వారి విధి నిర్వహణ పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో కమ్యూనిటీ పరంగా ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది లేనిది, అడిగి తెలుసుకుని, ప్రస్తుత పరిస్థితి అంత ప్రశాంతంగా ఉన్నదని తెలుసుకుని ఆనందించారు.

"సాగర్ కా వాచ్" కార్యక్రమం తడువుగా నిర్వహిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకు రావచ్చు అని, సిబ్బంది సంక్షేమంలో రాజీ పడవద్దని తెలిపారు. 
 
సముద్ర తీర ప్రాంత ప్రజల అందరితో మర్యాదపూర్వకంగా మెలగుతూ, అనునిత్యం ఆ ప్రాంతాలలో సిబ్బంది నిరంతర తనిఖీలు చేస్తూ, నిఘా ఏర్పాటు చేయాలని ,తరుచు ఆ ప్రాంతాలను విజిట్ చేస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలియజేశారు. ఏవైనా సమస్యలు మీ దృష్టికి వస్తే వెంటనే తెలియ చేయాలని తెలిపారు
 
విధులు నిర్వహిస్తున్న  అధికారులు,సిబ్బంది పోలీస్ శాఖలోకి ఎప్పుడు ప్రవేశించింది ఏఏ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తుంది కుటుంబం గురించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments