అసాంఘిక కార్యకలాపాలకు ఆనవాలుగా ఉన్న నగర శివార్లలో ఉన్న ప్రాంతాలను ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు అవిలాల చెరువు, సీతమ్మ ట్రస్ట్, గరుడాద్రి, అంజనాద్రి వసతి గృహాలు, 150 బైపాస్ రోడ్, పేరూరు, ఉప్పరపల్లి శివార్లలో ఆకస్మిక తనికీలు నిర్వహించి అనుమానాస్పద స్థావరాలను గుర్తించారు.
ఇకపై జిల్లా వ్యాప్తంగా మత్తుపదార్థాల జోరుకు అడ్డుకట్ట వేస్తామని చీకటి రాజ్యానికి చెల్లుచీటి అన్నారు. స్వలాభం కోసం తప్పుదోవ పెట్టించే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఇప్పటికే ప్రత్యేక టాస్క్ ఫోర్సు బృందాలు మత్తు పదార్థాల అక్రమ రావానాలపై కన్నేసి ములాలలను కనుగొనే పనిలో నిమగ్నమై ఉందని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎలాంటి అక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదన్నారు.
ముఖ్యంగా యువతి యువకులు కూడా సరదాకోసమని శివార్ల ప్రాంతాలకు వేళ్ళకూడదని సూచించారు. భద్రత విషయంలో పోలీస్ వారు తీసుకొను చర్యలకు ప్రజలు సహకరించాలని, ప్రజల సహకారం ఉంటేనే నగరంలో శాంతీయుత వాతావరణం నెలకొలుపుగలుగుతామని పర్యటన సందర్భాగా జిల్లా యస్.పి గారు తెలియజేసారు. ఈ తనిఖీలలో దిశా డి.యస్.పి రామరాజు గారు, యం.ఆర్.పల్లి యస్.ఐ నరసింహ వారు పర్యటించారు.