Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల వేధింపులు.. అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (09:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా వైకాపా నేతల వేధింపులు భరించలేక ఓ అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలోని గురువిందగుంట గ్రామంలో శనివారం జరిగింది. 
 
గ్రామంలో 20 యేళ్లుగా ఆంగన్‌వాడీ టీచ‌ర్ పనిచేస్తున్న అన్నపూర్ణను అదే గ్రామ వైసీపీ నాయకులు వారం రోజులుగా వేధిస్తున్నారు. వేరే ప్రాంతంలో ఉంటున్న వారికీ అంగన్‌వాడీ నుంచి ఆహార పదార్థాలు ఇవ్వాలని, తాము చెప్పినట్లు వినాలని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించసాగారు. 
 
అంగ‌న్‌వాడీకి వచ్చే పోషకాహారం గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయడంలేదని అల్లరి చేస్తామని, తమకు అనుకూలమైన వారిని అంగన్‌వాడీ టీచర్‌గా ఎంపిక చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్యాయత్నం చేసింది. తన చావుకు ఎంపీటీసీ సభ్యుడు వేమూరి మోహన్, అతని అనుచరులు సత్యనారాయణ, దారం జోజిబాబ కారణమని ఓ లేఖ రాసిపెట్టింది.
 
ప్రస్తుతం ఆమె గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద మండలంలోని అంగ న్వాడీ టీచర్లు ఆందోళన నిర్వహించారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐసీడీ సీఎస్ అధికారులు అంగన్‌వాడీ టీచర్ అన్నపూర్ణను పరామర్శించారు. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని, ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments