Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల‌కు రూ.50 ల‌క్ష‌ల కోవిడ్ బీమా

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (19:28 IST)
ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు కోవిడ్ బీమా వర్తింపజేయాలని నిర్ణ‌యించింది. ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల చొప్పున కోవిడ్ బీమా వర్తింపజేస్తూ బుధ‌వారం ఆదేశాలు జారీ చేసింది.

కార్మిక పరిషత్ సహా కార్మికుల వినతిపై స్పందించి ఆర్టీసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే విష‌యంపై  కార్మిక పరిషత్ నేతలు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబునుని కలసి మంగ‌ళ‌వారం వినతి పత్రం అందించారు.

ఈ క్ర‌మంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింప జేస్తున్న‌ట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీలో కరోనాతో ఇప్పటి వరకు 36 మంది మరణించిన నేప‌థ్యంలో వారంద‌రికీ బీమా వర్తింపజేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది.

మృతుల వివరాలు సహా తగిన డాక్యుమెంట్స్‌ను ఈ నెల 28లోగా పంపాలని అన్ని జిల్లాల రీజ‌న‌ల్ మేనేజ‌ర్స్‌కు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments