Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. ఓటు వేసిన కోరుకల్లు సర్పంచ్.. పండంటి ఆడబిడ్డకు?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (15:54 IST)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళ పోలింగ్ రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ పోటీ చేశారు. 9 నెలల గర్భిణి అయిన ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. శనివారం ఉదయం తన ఓటు హక్కును ఆమె వినియోగించుకున్నారు. ఓటు వేసిన కాసేపటికే ఆమెకు నొప్పులు వచ్చాయి. 
 
దీంతో, ఆమెను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలింగ్ రోజున బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. కోరుకల్లు సర్పంచ్ స్థానాన్ని మహిళలకు కేటాయించారు.
 
ఏపీలో ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 20,817 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44,876 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వివరాలు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments