Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి ఎడ్లబండి మరబొమ్మలు చేయండి, మొదటి బహుమతి రూ.2 లక్షలు

అమరావతి: అతిథులకు ఇచ్చే కొండపల్లి ఎడ్ల బండి మరబొమ్మల తయారీకి ఔత్సాహికుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విజేతలకు మొదటి బహుమతిగా రూ. 2 లక్షలు, రెండో బహుమతి కింద రూ.లక్ష, మూడో బహుమతిగా రూ.50వేలు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (13:49 IST)
అమరావతి: అతిథులకు ఇచ్చే కొండపల్లి ఎడ్ల బండి మరబొమ్మల తయారీకి ఔత్సాహికుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విజేతలకు మొదటి బహుమతిగా రూ. 2 లక్షలు, రెండో బహుమతి కింద రూ.లక్ష, మూడో బహుమతిగా రూ.50వేలు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిథులకు కొండపల్లిలో తయారవుతున్న ఎడ్ల బండి - రైతు బొమ్మను అందిస్తోంది. ఈ బొమ్మలో ఎటువంటి కదలికలూ ఉండవు. అయితే, ఇకపై అతిథులకు కదిలే కొండపల్లి ఎడ్ల బండి - రైతు బొమ్మను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కదిలే(మరబొమ్మ) కొండపల్లి ఎడ్ల బండి - రైతు బొమ్మను తయారుచేసే ఇంజనీర్లు, వడ్రంగులు, ఇతర ఔత్సాహికుల నుంచి డిజైన్లతో కూడిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆ ప్రకటనలో తెలిపారు. 
 
దరఖాస్తులతో పాటు డిజైన్లను డిసెంబర్ 31 తేదీలోగా అందజేయాలన్నారు. పూర్తి వివరాలతో పాటు ఏవైనా ప్రశ్నలుంటే డిసెంబర్ 20 తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా asprotocal@gmail డాట్ comకు గాని, 9705906942 ఫోన్ నెంబరుకు గాని సంప్రందిచొచ్చునన్నారు. సమాధానాలను apgov.inలో పొందుపరుస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో డిజైన్ల ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. అదే నెల రెండో వారంలో విజేతలను ఎంపిక చేస్తామన్నారు. కొండపల్లి ఎడ్ల బండి - రైతు బొమ్మ వివరాలను ఔత్సాహికులే స్వయంగా సేకరించుకోవాలని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
 
డిజైన్లు ఇలా ఉండాలి...
• బొమ్మ 25 సెం.మీ పొడవు, 10 సెం.మీ వెడల్పు, 15 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి. 
• యంత్రభాగం 25 సెం.మీ. పొడవు, 10 సెం.మీ వెడల్పు కలిగి, బొమ్మ కింద భాగంగా అమర్చాలి.
• చేతి దండంతో(Crank Shaft) యంత్రాన్ని ఆడిస్తుండాలి. బ్యాటరీ, మోటార్లను వాడకూడదు.
• విడి భాగాలను తేలికపాటి చెక్కతో తయారు చెయ్యాలి.
 
• బొమ్మలో కదలవలిసిన భాగాలు :
* రెండు చక్రాలు తిరగాలి.
* రెండు ఎద్దులకున్న నాలుగు కాళ్లు నడుస్తున్నట్లు కదలాలి (ప్రతి మోకాలి దగ్గర కీలు ఉండాలి)
* రెండు ఎద్దుల తలలు అటూ ఇటూ ఊగుతూ ఉండాలి.
* అన్నీ సమస్థితిగా(synchronous) కదులుతుండాలి.
* చేతి దండం(Crank Shaft) తిప్పితే మొత్తం ఎడ్ల బండి నిజంగా నడుస్తున్న భావన కలగాలి.
* బొమ్మ అందంతో గాని, ఆకృతితో గాని పనిలేదు. బొమ్మ కదిలే విధానం సమర్థవంతంగా ఉండాలి.
* యంత్రంలోని భాగాలు, అసెంబ్లీని On Shapతో గాని, Solid Worksతో గాని, సమాన సాఫ్ట్వేర్‌తో చెయ్యాలి. 
 
దరఖాస్తుతో పాటు అందజేయాల్సిన డిజైన్లు ..
* కొండపల్లి ఎడ్ల బండి-  రైతు మరబొమ్మకు చెందిన వివరాలను pdf రూపంలో అందజేయాలి.
* మరబొమ్మ యంత్రానికి చెందిన డ్రాయింగ్.
* బొమ్మలో ఉన్న ప్రతి విడి భాగం ముందు, వెనుకా, పక్కల భాగాల కొలతలు...
* విజయంతంగా ఒక నిమిషం పాటు కదులుతున్న కొండపల్లి ఎడ్ల బండి-  రైతు కినెమాటిక్ బొమ్మ యానిమేషన్ యూట్యూబ్ వీడియో లింకు.
* నడుస్తున్న యంత్రంతో మీరు తయారు చేసిన బొమ్మ.
* వీటితో పాటు ఆధార్ నెంబర్, ఫోన్ నెంబరుతో పాటు ఈ మెయిల్ అడ్రాస్ ను asprotocal@gmail డాట్ comకు డిసెంబర్ 31 తేదీ లోగా పంపించాలి. 
 
డిజైన్లు ప్రదర్శించే విధానం...
* ఔత్సాహికులను పిలిచిన రోజున ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
* కినెమాటిక్ డ్రాయింగ్ రన్ చేసి కంప్యూటర్‌లో చూపించాల్సి ఉంటుంది.
* యంత్రాన్ని భౌతికంగా నడిపించాలి. 
 
ఎంపిక చేసే విధానం...
* ఔత్సాహికులు ఈ మెయిల్ ద్వారా అందజేసిన pdf, యూట్యూబ్ వీడియోలను పరిశీలిస్తారు.
* విజయవంతంగా పని చేసిన డిజైన్లను ఎంపిక చేసి, విజేతలకు ఈ మెయిల్ ద్వారా సమాచారమందిస్తాం.
* నిర్ధేశించిన రోజున ప్రభుత్వ కమిటీ ముందు డిజైన్ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
* కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న డిజైన్‌ను ఎంపిక చేయడం జరుగుతుంది. 
* బహుమతి పొందిన మూడు డిజైన్లపై సర్వహక్కులూ ప్రభుత్వానికే చెందుతాయి అని ఆ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments