Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నకు బెయిల్ మంజూరు.. రేపు విడుదల

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (20:41 IST)
పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో  నిమ్మాడలో జరిగిన ఓ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన మంగళవారం జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నకు ఫిబ్రవరి 2న కోటబొమ్మాలి కోర్టు రిమాండ్ విధించింది. అచ్చెన్నాయుడుతో పాటు 21 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేసింది. రేపు జైలు నుంచి అచ్చెన్నాయుడు విడుదల కానున్నారు.
 
అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే వైకాపా పోటీకి దించేందుకు వ్యూహాన్ని రచించింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి నచ్చజెప్పాలని ప్రయత్నించారు. 
 
కానీ, పోలీసులు మాత్రం అచ్చెన్నాయుడుపై బెదిరించినట్టుగా కేసు నమోదు చేశారు. అదేసమయంలో అక్కడ వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ హల్ చల్ చేశారు. నేరుగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. 
 
రోడ్లపైకి భారీ ఎత్తున వచ్చిన వైకాపా కార్యకర్తలు నడిచి బీభత్సం సృష్టించారు. అయితే వారెవరిపైనా కేసులు నమోదు చేయలేదు. అచ్చెన్నాయుడుపై మాత్రం కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే అచ్చెన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments