Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరకుంటలో శవమై తేలిన ఇద్దరు టీచర్లు.. ఆత్మహత్యా? హత్యా?

ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ గ్రామ శివారులోని ఊరకుంటలో ఆదివారం ఆ ఇద్దరు యువతులు శవమై త

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (13:08 IST)
ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ గ్రామ శివారులోని ఊరకుంటలో ఆదివారం ఆ ఇద్దరు యువతులు శవమై తేలారు.
 
వివరాల్లోకి వెళితే.. ఖానాపూర్ మండల కేంద్రంలోని ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన తొంటుకూరి హరీశ(22), కడెం మండలం ఎల్లగడప గ్రామానికి చెందిన కొండవేని హరిత(23) స్నేహితులు. ఈ ఇద్దరు యువతులు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
శనివారం వీరిద్దరూ అదృశ్యమయ్యారు.  బంధువులు వారిని వెతికే పనిలో ఉండగానే.. ఆదివారం వారు ఊరకుంటలో మృతదేహాలుగా కనిపించారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని ఇరువురి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విభిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments