Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురందేశ్వరి, కన్నా ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా మారిపోయారు.. కేశినేని నాని

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. కన్నాకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (09:58 IST)
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. కన్నాకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్ర ద్రోహి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.


నగరంలోని తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ.. కన్నా రాష్ట్ర ద్రోహి అని, బీజేపీలో చేరి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి అని విమర్శించారు.
 
అంతేగాకుండా పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా తయారయ్యారని మండిపడ్డారు. బీజేపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్స్ గంటలో వేగంగా అమ్ముడు అయ్యాడంటే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధితో ముందుకు వెళుతుందని కేశినేని నాని వ్యాఖ్యానించారు. 
 
దేశం స్వాతంత్ర్యం సాధించిన ఈ 72 సంవత్సరాలలో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి ముందుకి వెళ్తుందని నాని అన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్ల‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments