Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాని, బిగ్ బాస్ ఊపిరి పీల్చుకోండి... బాబు గోగినేని బయటకు వచ్చేశారు...

అందరూ ఊహించినదే జరిగింది. బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బాబు గోగినేని బయటకు వచ్చేశారు. తొమ్మిదోవారం ఆయన ఎలిమినేట్‌ అవబోతున్నట్లు ముందుగానే సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. మొన్నటి ఎపిసోడ్‌లో ఆ ఊహాగానాలు నిజమయ్యాయి. మేధావిగా, నాస్తికుడిగా, మానవ హక్కుల

నాని, బిగ్ బాస్ ఊపిరి పీల్చుకోండి... బాబు గోగినేని బయటకు వచ్చేశారు...
, మంగళవారం, 14 ఆగస్టు 2018 (15:14 IST)
అందరూ ఊహించినదే జరిగింది. బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బాబు గోగినేని బయటకు వచ్చేశారు. తొమ్మిదోవారం ఆయన ఎలిమినేట్‌ అవబోతున్నట్లు ముందుగానే సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. మొన్నటి ఎపిసోడ్‌లో ఆ ఊహాగానాలు నిజమయ్యాయి. మేధావిగా, నాస్తికుడిగా, మానవ హక్కుల ప్రచారకర్తగా విశేషమైన గుర్తింపు పొందిన బాబు గోగినేని బిగ్‌బాస్‌ షోకు వెళ్లడమే చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. 
 
ఈ షోకి గోగినేని వంటి వారు వెళ్లడం ఏమిటా అని చాలామంది విమర్శించారు. అయితే…. ఈ షోతో గోగినేనికి మరింత గుర్తింపు లభించింది. అరుదైన అనుభవమూ ఆయనకు దక్కింది. షోలో పాల్గొన్న వారందరినీ ఆడిషన్స్‌ ద్వారా ఎంపిక చేస్తే…. బాబును మాత్రం షో నిర్వాహకులే ఆహ్వానించారు. బాబు గోగినేని బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తనదైన శైలిలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బిగ్‌బాస్‌ను ధిక్కరించి బిగ్గర్‌ బాస్‌ అని ముద్రవేసుకున్నారు. బాబు ఆలోచనలకు, అక్కడ షోలో ఉన్న మిగతావారి ఆలోచనలకు చాలా తేడా వున్నప్పటికీ సర్దుకుని ఇంట్లో ఉండేందుకు ప్రయత్నించారు. ఇంట్లోని వారందరూ బాబు గోగినేనిలోని మేధస్సును, విజ్ఞానాన్ని గౌరవించారు. ఆయన్ను ఒక గురువులా చూశారు. 
 
అయితే…. టాస్క్‌లలో కౌశల్‌తో, నూతన్‌ నాయుడితో తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఆ ఇద్దరూ బాబును ఏకవచనంతో సంబోధించే దాకా వెళ్లింది. బాబు గోగినేనిని డీల్‌ చేయడం హోస్ట్‌గా నానీకి కూడా ఇబ్బందిగా మారింది. మిగతా సభ్యులను మాట్లాడినట్లు బాబు గోగినేనిని మాట్లాడలేకపోయారు నాని. రానురాను టాస్క్‌లు తీవ్రంగానూ, కఠినంగానూ ఉంటాయి. షో రక్తికట్టాలంటే కఠనమైన టాస్కులు ఇవ్వాలి. 
 
అటువంటప్పుడు బాబు వంటి వ్యక్తి అక్కడ ఉండటం బిగ్‌బాస్‌కు ఇబ్బందే అవుతుంది. ఈ నేపథ్యంలో బాబు గోగినేని ఎలిమినేషన్‌ ఖాయమన్న అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమయింది. ఊహించిన విధంగానే ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు ఇక నాని, బిగ్‌బాస్‌ ఊపిరి పీల్చుకోవచ్చు.
 
బయటకు వస్తున్న బాబు గోగినేని బిగ్‌బాస్‌ షో రహస్యాలు ఏమైనా బయటపెడుతారా, వివాదాస్పద అంశాలను బయటకు వెల్లడిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హౌజ్‌లో మాట్లాడలేని అన్ని విషయాలనూ బయట మాట్లాడేందుకు వీలుంటుంది. లోపల మాట్లాడినా… బిగ్‌బాస్‌ తనకు నచ్చిన విషయాలను ప్రేక్షకులకు చూపించివుండకపోవచ్చు. అటువంటివి ఇంటర్వ్యూల్లో బాబు గోగినేని మాట్లాడే అవకాశాలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RX 100 మూవీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా..?