Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి : వైకాపా ఎమ్మెల్యే కారుమూరి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:08 IST)
సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైకాపాకు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి అంటూ మండిపడ్డారు. పైగా, ఆయన్ను అసలు తాను మనిషిగా కూడా చూడనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకు ఎంతో అభిమానం ఉందని చెపుతూనే... పార్టీపై, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 
 
ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల జగన్‌కు ఆయన రాసిన లేఖలో కూడా... ఓవైపు స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే... మరోవైపు తాను చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. అలాగే, తణుకు వైకాపా ఎమ్మెల్యేపై కూడా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వర రావు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. రఘురామకృష్ణంరాజు ఒక తేడా మనిషి అంటూ మండిపడ్డారు. ఆయనను తాను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారని... అందుకే ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments