Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన లోకి కన్నా లక్ష్మీనారాయణ? జనసేన పట్టు బిగిస్తుందా?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:00 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ బలపడటం అనేది ఎంతమాత్రం కూడా సాధ్యం కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్ని విధాలుగా రాజకీయం చేసిన సరే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ను లేదా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం అనేది సాధ్యమయ్యే పనికాదని అనుకుంటున్నట్లు భోగట్టా.

ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది నేతలు వేరే పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వేరే పార్టీల వైపు చూస్తున్న పర్వాలేదు కానీ ఇప్పుడు జనసేన పార్టీ లోకి వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ నేతలు రెడీ అవుతున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో అలాగే పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపించిన నేపథ్యంలో కొంతమంది నేతలు జనసేన పార్టీ లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జనసేన పార్టీలో విజయవాడలో కొంతమంది బీజేపీ నేతలు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గుంటూరులో కూడా కొంతమంది నేతలు ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది.
 
కొంతమంది బీజేపీ నేతలతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనసేన పార్టీలోకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి.

జనసేన పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఇప్పుడు బీజేపీ నేతల కోసం తీవ్రంగానే కష్టపడుతున్నారని సమాచారం. అందులో ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ కోసం కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది.

మరి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ లోకి వస్తారా లేదా అనేది చూడాలి. ఆయనతో పవన్ నేరుగా మాట్లాడుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పార్టీ మారవచ్చని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments