ఎపి బిజెపిపై జనసేన నాయకులు పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి తమకు పూర్తి స్థాయిలో సహకరించలేదని పేర్కొన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఫలితాల్లో తమకు డబుల్ డిజిట్ వస్తుందని అనుకున్నామని అన్నారు.
బిజెపి నుంచి జనసేనకు సరైన మద్దతు లభించలేదన్నారు. పొత్తు దగ్గర చిన్నచిన్న ఇబ్బందులున్నాయని, క్షేత్రస్థాయిలో తమ నాయకత్వంతో బిజెపి నాయకత్వం కలవలేదని అన్నారు. బిజెపి విధానాలతో విజయవాడలో జనసేనకు ఇబ్బంది ఎదురైందని విమర్శించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ టిఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్యం చేస్తూ.. పవన్ పొత్తు నియమాలు ఉల్లంఘించారని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.