కంటెయినర్ లో సెల్ ఫోన్లు కొల్లగొట్టిన కంజరభట్ల గ్యాంగ్ ని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజులు పాటు నిర్విరామంగా శ్రమించి కంజరభట్ల గ్యాంగ్ ని అనతికాలంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులుగా చరిత్ర సృష్టించారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కళ్ళుమూసి తెరిచేలోపు కాజేస్తారు
కంజరభట్ల గ్యాంగ్ అంటే ఆషామాషీ కాదు. ప్రాణాలు సైతం లెక్కచేయరు...ప్రాణాలు తీసేందుకు వెనుకాడరు. ఈ నెల 15వ తేదీన చిత్తూరు జిల్లా వేదాయపాలెం శ్రీ సిటీలోని రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రై.లిమిటెడ్ నుండి 13,760 మొబైల్స్ ప్యాలెట్లు లోడ్ చేసుకొని కంటెయినర్ కలకత్తాలోని జియోమీ టెక్నాలజీ ఇండియా ప్రై.లిమిటెడ్ కి బయల్దేరింది.
ఈ క్రమంలో కంటైయినర్ ని ఫాలో చేసిన కంజరభట్ల గ్యాంగ్ గుంటూరు సమీపంలోని ఓ దాభా దగ్గర నిలుపుదల చేసి డ్రైవర్ టీ తాగుతున్న క్రమంలో 9 మంది కంజరభట్ల గ్యాంగ్ కంటైయినర్ సీల్ ఓపెన్ చేసి... 960 రెడ్ మి నోట్ ఆర్కి టిక్ 4జిబి/6జిబి ఫోన్లను దొంగిలించారు. ఈ క్రమంలో వెనుక వస్తున్న వాహనచోదకులు చోరీ జరుగుతున్నట్లు డ్రైవర్ కి చెప్పారు.
దీంతో తేరుకున్న డ్రైవర్ కంజర్ భట్లను వారించేందుకు ప్రయత్నించగా వారు కత్తులతో బెదిరించి ఊడాయించారు. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్బన్ పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి గడిచిన 15 రోజులుగా సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తూ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుండి 913 సెల్ ఫోన్ లు, 4,50,000 నగదుతో పాటూ నిందితులు వినియోగించిన వాహనంతో పాటూ కంటైయినర్ ని స్వాధీనం చేసుకున్నారు.
మిగతా నిందితులను కూడా అతి త్వరలో పట్టుకుంటామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. చివరిగా కేసును చేధించడంలో చొరవ చూపిన అధికారులు అయిన 1) ఎం. కమలాకర రావు, డి.ఎస్పీ. సౌత్ సబ్ డివిజన్. , 2) కె. వీరా స్వామి, సి.ఐ., నల్లపాడు పి.ఎస్. , 3) కె. వాసు, సి.ఐ., డి.సి.ఆర్.బి. , 4)పి. విశ్వనాథరెడ్డి, ఎస్సై, టెక్నికల్ అనాలసిస్ వింగ్, 5) జె. అమరవర్ధన్ , ఎస్సై. పట్టాభిపురం పి.ఎస్. , 6) ఎస్. రవీంద్ర, ఎస్సై. అరండల్ పేట పి.ఎస్. , 7) రాజశేఖర్, ఎస్సై. తాడికొండ పి.ఎస్., 8) ఆర్. శ్రీనాధ్, ఎస్సై, టెక్నికల్ అనాలసిస్ వింగ్, 9) యు. శ్రీనివాసరావు, ఏ.ఎస్సై, నగరంపాలెం పి.ఎస్. , 10) జి. బాలాజీ, హెచ్. సి., టెక్నికల్ అనాలసిస్ వింగ్,
ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. గంగాధరం, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మనోహర్, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ బాల సుందరరావు, సి.సి.ఎస్. డి.ఎస్పీ ప్రకాష్ బాబు, డి.సి.ఆర్.బి. డి.ఎస్పీ. శ్రీనివాసరావు, ఏ.ఆర్. డి.ఎస్పీ. చంద్రశేఖర రావు, పి.సి. ఆర్. సి.ఐ. వీరా నాయక్, ఆర్. ఐ. రాజారావు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.