Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో కరోనా.. భక్తులకు అనుమతి లేదు..

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (11:58 IST)
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి భక్తులు అనుమతిని నిషేధించారు. కారణం కరోనా.. కాణిపాకం ఆలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. కాణిపాకం ఆలయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... ఆలయ నిర్వాహకులు, ఆలయ సిబ్బందికి కరోనా టెస్టులు చేయించారు. 
 
వాటి రిపోర్టులు తాజాగా వచ్చాయి. వారిలో ఒకరికి కరోనా వున్నట్లు తేలింది. భక్తులు అన్ని విధాలా సామాజిక దూరం పాటించేలా చేశారు. మాస్కులు తప్పనిసరి చేశారు. కానీ సిబ్బందికి కరోనా సోకడంతో ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తులు... కాణిపాకం వినాయక స్వామిని కూడా దర్శించుకుంటారు. ఓ బావిలో దొరికిన వినాయక మూల విరాట్టు విగ్రహం... క్రమంగా సైజు పెరుగుతోంది. ఏళ్లు గడిచేకొద్దీ సైజు పెరుగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందట విగ్రహం కింద ఉండే ప్లేటు చిన్నదై పగిలిపోవడంతో... దాన్ని తొలగించి పెద్ద ప్లేటు ఉంచారు. ఆ ఆలయ విశిష్టతల్లో ఇదీ ఒకటి. 
 
అందువల్లే తిరుమల దర్శనం తర్వాత... చాలా మంది కాణిపాకం వస్తుంటారు. ప్రతిజ్ఞలు కూడా చేస్తుంటారు. అలాంటిది మళ్లీ ఆలయంలో భక్తులకు నిషేధం అమలు చేయడం భక్తులకు నిరాశ చెందారు. కానీ కరోనా సమయంలో ఇది తప్పదని అదికారులు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments