నేను అవినీతికి పాల్పడి ఉంటే నాశనమైపోతా : మాజీ మంత్రి కామినేని(వీడియో)
అనుకున్నదే చేశారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత నేరుగా చిత్తూరుజిల్లా కాణిపాకంకు వచ్చిన కామినేని శ్రీనివాస్ ఆలయంలో ప్రమాణం చేశారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి ఉంటే ఖచ్చితంగా నాశనమైపోత
అనుకున్నదే చేశారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత నేరుగా చిత్తూరుజిల్లా కాణిపాకంకు వచ్చిన కామినేని శ్రీనివాస్ ఆలయంలో ప్రమాణం చేశారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి ఉంటే ఖచ్చితంగా నాశనమైపోతానని చెప్పారు. ఇప్పటివరకు ఏ మంత్రి ఇలాంటి ప్రమాణం చేసిన దాఖలాలు లేవు. టిడిపి, బిజెపి నేతలు విడిపోక ముందు కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కామినేని శ్రీనివాస్ పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉన్న సమయంలో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, తెలుగుదేశంతో జతకట్టడం వల్లే ఆయన కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగారని చెప్పారు. ఆ ఆరోపణలతో కామినేని శ్రీనివాస్ ఆవేదనకు గురయ్యారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పారు. కాణిపాకం వరసిద్థి వినాయకుని సాక్షిగా నేను అవినీతికి పాల్పడి ఉంటే ఆ దేవుడే చూసుకుంటాడని, దీనికి మించి తానేమీ చేయబోనని స్పష్టం చేశారు కామినేని శ్రీనివాస్. చూడండి ఆయన మాటల్లోనే...