Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్ శుభ్రం చేస్తూ ఊపిరాకడక చనిపోయిన కార్మికులు - ఏడుగురు మృతి

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకును శుభ్రం చేసేందుకు అందులో దూకిన ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో ఒకరి వెనుక మరొకరు లోపలికి దిగారు. లోపల ఊపిరాడకపోవడంతో అందరూ చనిపోయారు. పెద్దపురం మండలం జి.రాంగపేటలోని అంబటి సబ్బయ్య ఫ్యాక్టరీలో ఈ దారుణం జరిగింది. 
 
జి.రాంగపేటలో ఆయిల్ ఫ్యాక్టరీని కొత్తగా కడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆయిల్ ట్యాంకు‌ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు లోపలికి దిగారు. లోపలి ఊపిరి ఆడకపోవడంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసుకునిరావడానికి మరో ఇద్దరు కార్మికులు లోపలికి దిగగా వారు కూడా స్పృ కోల్పోయారు. ఇలా ఏడుగురు కార్మికులు ట్యాంక్ లోపలకు వెళ్లిప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన కార్మికులతో ఐదుగురు పాడేరు వాసులేనని అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని భావిస్తున్నారు. మిగతా ఇద్దరూ కార్మికులను పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన వారుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments