Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశ్రయం ఇచ్చి.. కోర్కె తీర్చమన్న యజమాని... భార్య వత్తాసు!

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (09:05 IST)
ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఓ కీచకుడి నిజస్వరూపం బయటపడింది. చదువుకునేందుకు అక్కా చెల్లికి ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని ఆ తర్వాత లైంగిక వాంఛ తీర్చాలంటూ ఒత్తిడిచేశాడు. ఆయనకు కట్టుకున్న భార్య కూడా వత్తాసు పలకడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కాకినాడ గ్రామీణంలోకి ఓ గ్రామానికి చెందిన 28, 24 ఏళ్ల అక్కాచెల్లెలు కాకినాడ అశోక్‌నగర్‌లో ఉంటున్న మడికి రాజేశ్వరదయాళ్‌, రెండో భార్య స్వాతి వద్ద సుమారు పదేళ్లుగా ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్నారు. 
 
అయిత, గత కొన్ని రోజులుగా రాజేశ్వరదయాళ్‌ ఇద్దరు యువతులనూ వేధిస్తూ.. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు. అతడి చర్యలను రెండో భార్య కూడా సహకరించింది. 
 
తాము చదువుకునేందుకు ఆశ్రయం కల్పించి అండగా ఉంటాడనుకున్న వ్యక్తి వికృత చేష్టలకు భయపడిన ఆ ఇద్దరు యువతులూ సొంత గ్రామానికి వచ్చేశారు. బాధిత యువతుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం