Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కదిరి -పులివెందుల సరిహద్దులో భారీ వర్షంతో తెగిన బ్రిడ్జి

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (16:11 IST)
పులివెందుల, కదిరి నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతంలో భారీ వ‌ర్షాలు తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించాయి. తలుపుల మండలం గొల్లపల్లి తండా పైభాగంలోని చిన్నపల్లి-ఉడుముల కుర్తి గ్రామాల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు గొల్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.

పులివెందుల సమీపంలోని కనంపల్లి చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై గొల్లపల్లి తండా వరకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గురువారం రాత్రి నుంచి వాహనాల రాకపోకలను నిలిపి వేయించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి, ప్రమాదాన్ని నివారించారు.

భారీ వర్షాలకు నామాలగుండు వంక  నీటి ప్రవాహంతోఉద్ధృతంగా ప్రవహించింది. కనంపల్లి సమీపంలోని అరటి, మామిడి ఇతర రకాలైన పంట పొలాలు నీట మునిగాయి. భూములు కోతకు గురయ్యాయి. పులివెందుల కదిరి పట్టణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ రెండువైపులా నిలిచిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments