అవును.. 18 ఏళ్ల అమ్మాయికి ముగ్గురు భార్యలు.. ఎక్కడో తెలుసా?

అచ్చం అబ్బాయిలా వున్న ఓ అమ్మాయి.. ఏకంగా ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుని కడప జిల్లాలో కలకలం రేపింది. 18 ఏళ్ల రమాదేవి కడపజిల్లా జమ్మలమడుగులో ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (16:00 IST)
అచ్చం అబ్బాయిలా వున్న ఓ అమ్మాయి.. ఏకంగా ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుని కడప జిల్లాలో కలకలం రేపింది. 18 ఏళ్ల రమాదేవి కడపజిల్లా జమ్మలమడుగులో ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన రమాదేవి పులివెందులలోని ఓ కాటన్‌మిల్లులో పనిచేస్తోంది. 
 
అక్కడే జమ్మలమడుగు నియోజకవర్గంలోని భీమగుండం గ్రామానికి చెందిన మౌనిక అనే మరో యువతి కూడా పనిచేస్తోంది. అక్కడే వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆపై వీరిద్దరి వివాహం కూడా జరిగిపోయింది. అయితే మౌనికతో పెళ్లికి ముందే రమాదేవి వందన, బుజ్జి అనే మరో ఇద్దరు అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకునట్లు సమాచారం. 
 
మౌనిక పెళ్లి చేసుకుందనే విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 18 ఏళ్ల వయస్సున్న ఓ అమ్మాయి మరో ముగ్గురు అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మౌనిక కంటే ముందే రమాదేవి వివాహం చేసుకున్న ఇద్దరమ్మాయిలను వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లిపోయారని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments