సీఎం జగన్ ఇలా ఎందుకు చేశారంటూ కె.ఎ. పాల్ ప్రశ్న

Webdunia
సోమవారం, 11 మే 2020 (19:43 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్. తిండిలేక జనం అల్లాడుతుంటే మద్యాన్ని ప్రభుత్వం విక్రయించడం ఏమిటో అర్థం కాలేదన్నారాయన. సిఎం జగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఆలోచించే శక్తి ఉందా అంటూ ప్రశ్నించారాయన.
 
నేను సిఎంను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మద్యం అడిగారా... కరోనా విపత్తు సమయంలో జనం కడుపునిండా తిండి అడుగుతున్నారు. సామాన్యుల పరిస్థితి హీనంగా తయారైంది. కాబట్టి వారిని ఆదుకోవాలి. ఇప్పటికీ ఆకలిచావులు కొనసాగుతున్నాయి. ఎంతోమంది అర్థాకలితో మరణిస్తున్నారు కూడా.
 
అందుకే ఈ వైన్ షాపులను మూసివేయాలని కోరుతున్నాను. ఇప్పటికైనా జగన్ ఆలోచించాలి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిర్ణయాలన్నీ ఉండాలి అంటూ కె.ఎల్.పాల్ సున్నితంగా విమర్శించారు. గ్రామాల్లోను, మారుమూల ప్రాంతాల్లోను దుర్భరమైన పరిస్థితిని కొంతమంది అనుభవిస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళండి, వారిని కాపాడండి, వారికి చేతనైన సాయం చేయండి అంటూ కోరారు కె.ఎ.పాల్. ఎప్పుడూ కె.ఎ.పాల్ విమర్సించే నెటిజన్లు ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోను చూసి ఏమంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments