Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయమూర్తులు అందరికీ అర్థమయ్యే భాషలో తీర్పులివ్వాలి: జస్టిస్ ఎన్వీ రమణ

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (15:19 IST)
అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని, లేకుంటే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఆధ్వర్యంలో న్యాయ అవగాహన ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
 
 
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాట్లాడుతూ, అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని అభిలషించారు. అన్నింటి కంటే ముఖ్యంగా న్యాయవ్యవస్థ మానవీయంగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. బాధితులు తొలుత వచ్చేది ట్రయల్ కోర్టులకేనని గుర్తించాలని తెలిపారు. మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ లను ప్రాచుర్యంలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

 
సుప్రీంకోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని ర‌మ‌ణ సూచించారు. న్యాయమూర్తులు అందరికీ అర్థమయ్యేలా సాధారణ భాషలోనే, స్పష్టంగా తీర్పులు రాయాలని పేర్కొన్నారు. న్యాయస్థానాల నిర్ణయాలకు సామాజిక ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. న్యాయసహాయ ఉద్యమ ప్రోత్సాహానికి సహకరించారంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కృత‌జ్ణ్న‌త‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments