Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మహాత్మా గాంధీ కాదు.. ఆయన ఒక్కడి వల్లే టీడీపీ గెలవలేదు : జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్స

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (15:14 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్స్ చేశారు. 
 
ఆయన మంగళవారం విజయవాడలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబు ఒక్కడి వల్లే అధికారంలోకి రాలేదన్నారు. చంద్రబాబు పిలిస్తే జనాలు (ప్రజలు) వచ్చేందుకు ఆయనేం మహాత్మా గాంధీ కాదని అన్నారు. 
 
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని, జగన్ సీఎం అయితే రాష్ట్రానికి మంచిది కాదన్న ఉద్దేశ్యంతోనే తాను టీడీపీలో చేరానని, ఈ విషయాన్ని తాను ఆనాడే చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

రాష్ట్రాన్ని అధికారులతో చంద్రబాబు పాలిస్తున్నారని అన్నారు. అధికారుల రాజ్యం వద్దని చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని... పద్దతి మార్చుకోకపోతే చంద్రబాబుకు ఇబ్బంది తప్పదని ఆయన అన్నారు. పయ్యావుల కేశవ్‌వంటి నాయకులకే గుర్తింపు లేకపోతే తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments