Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కోరిక నెరవేరదు.... జేసీ దివాకర్ రెడ్డి

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:44 IST)
దేశాన్ని మార్చడం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చేతయ్యేది కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం... మంగళవారం జంతర్‌‌మంతర్‌ దగ్గర ఎంపీ మాగంటి బాబు చేపట్టిన నిరాహారదీక్షకు టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న చంద్రబాబు కోరిక నెరవేరదనీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేస్తారన్న ఆశతో చంద్రబాబు రాహుల్‌ వెంట పడుతున్నారన్నారు.
 
ప్రధాని మోడీ ఒక ఫ్యాక్షన్‌ లీడర్‌లా, నియంతలా వ్యవహరిస్తున్నారనీ విమర్శించిన జేసీ రైల్వే జోన్‌ వల్ల ఏపీకి లాభం లేదనీ, ప్రభుత్వానికీ నష్టం లేదని ఆయన అన్నారు. కక్ష సాధించడం కోసమే కేంద్రం రైల్వేజోన్‌ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఉన్నంతవరకు ప్రజలకు సంక్షేమం అందుతుందని, ఎన్నికలకు ముందే రైతులకు చెక్కులు ఇస్తామనీ జేసీ దివాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments