Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకపై పోరాటం... జనసేనానికి విపక్షాల సంఘీభావం

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (11:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై జనసేన పార్టీ పోరుబాట పట్టింది. ఇందులోభాగంగా, ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనుంది. ఇసుకను వెంటనే అందుబాటులోకి తేవాలని, ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థికంగా సాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. 
 
మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం జంక్షన్‌ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో భవన నిర్మాణ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల సహకారం కోరారు. అన్ని ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు ఫోన్లు చేసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 
 
బీజేపీ, టీడీపీ ఇందులో పాల్గొనేందుకు అంగీకారం తెలిపాయి. అయితే బీజేపీ పాల్గొంటే అది తమకు సైద్ధాంతిక విభేదం అవుతుందని భావించి వామపక్షాలు దూరం కావాలని నిర్ణయించాయి. లాంగ్‌ మార్చ్‌లో పాల్గొనాలని తమ పార్టీ సీనియర్‌ నేతలు చింతకాలయ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కింజరాపు అచ్చెన్నాయుడులను టీడీపీ ఆదేశించింది. 
 
మరోవైపు, లాంగ్‌మార్చ్‌లో కాంగ్రెస్‌ నేతలు అనివార్య కారణాల వల్ల పాల్గొనడం లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి శనివారం విజయవాడలో మీడియాకు చెప్పారు. మద్దతు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ తమకు ఫోన్‌ చేశారని, అయితే పీసీసీ చీఫ్‌ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేయడం, పార్టీలో కొంత అనిశ్చితి కారణంగా తాము లాంగ్‌ మార్చ్‌కు వెళ్లలేకపోతున్నామని చెప్పారు. 
 
కాగా, ఈ లాంగ్ మార్చ్‌కు జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, తోట చంద్రశేఖర్‌, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, కోన తాతారావు తదితరులు లాంగ్‌ మార్చ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం