Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు సూపర్ అక్కా.. జనసేన మహిళా కార్యకర్త సుభాషిణి కౌంటర్ (వీడియో వైరల్)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాకు కష్టాలు మీద కష్టాలొస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భూమా అఖిలప్రియ డ్రెస్ కోడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న రోజాకు వైకాపా చీఫ్ జగ

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (17:04 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాకు కష్టాలు మీద కష్టాలొస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భూమా అఖిలప్రియ డ్రెస్ కోడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న రోజాకు వైకాపా చీఫ్ జగన్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. జగన్ ఇచ్చిన వార్నింగ్‌తో రోజా కాస్త నోటికి కళ్లెం వేశారు.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తలా తోకా లేవని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ మహిళా కార్యకర్త సుభాషిణి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు తిరుపతికి చెందిన సుభాషిణి అనే మహిళా కార్యకర్త, రోజాను తీవ్రంగా విమర్శిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
రోజా తనకు సోదరి వంటిదని సుభాషిణి తెలిపారు. రోజా అన్ పార్లమెంటరీ భాషను వాడుతున్నారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తాను తలాతోకా లేని పార్టీలో చేరబోనని జనసేనను ఉద్దేశించి రోజా చెప్పడాన్ని గుర్తు చేస్తూ, "మీరు సూపర్ అక్కా. మీరు కరెక్ట్ గానే మాట్లాడారు.

ఈ విషయంలో మీరు సూపర్. మీరు తలా తోక ఉన్న పార్టీల్లోనే ఉండండి. మాకు తలలే ఉన్నాయి. తోకలు లేవు" అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియోలో రోజాకు సుభాషిణి ఎలా కౌంటరిచ్చిందో చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments