Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (14:40 IST)
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైకాపా సర్కారును మీడియా ముందు ఎండగట్టారు. అమరావతిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. తెదేపా-జనసేన అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత వైకాపా వణికిపోయిందన్నారు. 
 
ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాల్సిందే అని.. సభకు బస్సులు కావాలని ఈ రోజు లెటర్ పెడుతున్నామని, బస్సులు ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 
 
టీడీపీ - జనసెన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తే 7306299999 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చని.. టీడీపీ తక్షణమే స్పందిస్తుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
 
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. చిలకలూరి పేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కలిసికట్టుగా విజయవంతం చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments