Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌ర్ స్టార్ ఇక ప్ర‌త్య‌క్ష‌పోరాటాల‌కు... నెల‌ఖ‌రులో చ‌ర్చ‌!

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:40 IST)
రాష్ట్రంలో దాష్టీక పాలన జరుగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వర్చువల్ ద్వారా ఆయన మాట్లాడుతూ, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు అని అన్నారు. వైసిపి అరాచకాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధం అవుతుందని వెల్లడించారు. 
 
ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో జనసేన బలంగా పొరాడిందని, తద్వారా 25.2% ఓట్లు సాధించాం అని పేర్కొన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే, అధికార యంత్రాంగం చోద్యం చూసింది అని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
 
 దాడులు, బెదిరింపులతో వైసిపి నేతలు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నార‌ని ప‌వ‌న్ విమర్శించారు. వైసిపి దాష్టిక పాలనను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి దాడులను ఎలా ఎదుర్కోవాలి? క్షేత్ర స్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో తమ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments