Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాని అత్యుత్సాహం.. పవన్ కళ్యాణ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (19:41 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. మత్స్యుకారుల అభ్యున్నతి సభలో ప్రసంగించేందుకు వెళ్లగా, ఓ అభిమాని అత్యుత్సావం వల్ల పవన్ కళ్యాణ్ చిన్నపాటి ప్రమాదంలో చిక్కుకున్నారు. 
 
రాష్ట్రంలోని మత్స్యుకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహానికి పవన్ కిందపడిపోయారు. దీంతో రోడ్‌షోలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ అభిమాని చేసిన పనికి పవన్ కళ్యాణ్ కిందపడిపోయినప్పటికీ.. ఆ తర్వాత నవ్వుతూ పైకి లేచి, ప్రజలకు అభివాదం చేశారు. 
 
నిజానికి నరసాపురం పట్టణం చేరుకున్న తర్వాత ఆయన అందరికీ కనిపించాలన్న ఉద్దేశ్యంతో కారు పైకి ఎక్కారు. అయితే, వెనుక నుంచి ఓ అభిమాని దూసుకొచ్చి కారుపైకి ఎక్కి పవన్‌ను కోగిలించుకోబోయాడు. అంతలోనే ఓ బాడీగార్డ్ గమనించి అభిమానిని పట్టుకుని కిందకులాగాడు. 
 
దీంతో సపోర్టు కోసం ఆ అభిమాని పట్టుకోసం పవన్‌ను పట్టుకున్నాడు. కానీ, బాడీగార్డ్ మరింత బలంగా లాగడంతో పవన్‌ను తోసేసి కిందకు లాగేశాడు. ఈ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్‌ కూడా పట్టుకోల్పోయి కాలు జారి కారు టాప్‌పై పడిపోయాడు. 
 
ఆ తర్వాత ఆయన కారుపైనే కొద్దిసేపు కూర్చొండిపోయారు. ఆ తర్వాత చిరునవ్వుతూ లేచి నిలబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments