Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ జగన్.. నువ్వొక సంస్కారహీనుడివి : పవన్ కళ్యాణ్ ధ్వజం

Webdunia
బుధవారం, 12 జులై 2023 (22:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మిస్టర్ జగన్.. నువ్వొక సంస్కార హీనుడివి. వెళ్లి ఒకసారి భారతి మేడం గారిని అడుగు.. ఏనాడైనా ఆవిడని మేం దూషించామా? అని పవన్ నిలదీశారు. జగన్ మాదిరిగా తన తండ్రి ముఖ్యమంత్రి కాదన్నారు. 
 
తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ మాట్లాడుతూ, ముస్లింలకు తాను వ్యక్తిగతంగా ఇష్టమన్నారు. కానీ, తాను బీజేపీ వైపు ఉన్నానని నమ్మడం లేదన్నారు. కానీ, జగన్ ముస్లింలకు షాదీ ముబారక్ తీసేశారని గుర్తు చేశారు. మీ మాతృభాషలో స్కూల్స్ పెట్టలేక పోయారన్నారు. నేను మాత్రం బీజేపీతో ఉన్నానా లేదా అన్నది మీకు అనవసరమని, మీకు న్యాయం చేస్తానా లేదా అని చూడండన్నారు. 
 
ఏపీలోని వలంటీర్ వ్యవస్థ అధిపతి ఎవరో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. చాలాచోట్ల వలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారన్నారు. వలంటీర్లు అందరూ అలాంటి వారు కాదని, కానీ ఈ వ్యవస్థలోనూ కొందరు కిరాతకులు ఉన్నారని ఆరోపించారు. వలంటీర్లు తనకు సోదర సమానులన్నారు. వారి పొట్టకొట్టాలనేది తన ఉద్దేశ్యం కాదన్నారు. వలంటీర్లు అందరూ చెడ్డవారు అని తాను చెప్పడం లేదని ఈ వ్యవస్థ ఎలా పని చేయాలో చెబుతున్నానని, వేతనం లేదా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేసే వాళ్లే వలంటీర్లు అని, డబ్బులు తీసుకునే వారిని వలంటీర్లు ఎలా అంటారని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments