Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని చెత్తలో దొరికిన 'సెర్చ్', 'అన్‌లాక్', 'డౌన్‌లోడ్' బటన్లు

Webdunia
బుధవారం, 12 జులై 2023 (22:19 IST)
నవాబుల నగరం హైదరాబాద్‌లో ఖర్ఖానా, పాట్నీ మరియు రాణిజంగ్ చుట్టూ ఉన్న అనేక పబ్లిక్ చెత్త కుండీల వద్ద వదిలివేయబడ్డ 'డౌన్‌లోడ్', 'అన్‌లాక్' మరియు 'సెర్చ్' యొక్క బటన్‌లు కనిపిస్తున్నాయి. ఇవి మన దైనందిన జీవితాలపై పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజీ యొక్క  ప్రభావం గురించి చమత్కారమైన ప్రశ్నలనూ లేవనెత్తుతున్నాయి. ఐటీ నగరం బెంగళూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న రెండు రోజుల తర్వాత ఇది హైదరాబాద్ నగరంలో కనిపించింది. 
 
చెత్త డంప్‌ల వద్ద కనిపించిన ఈ బటన్‌ల సమ్మేళనం సామాజిక మాధ్యమ వేదికలలో విపరీతమైన చర్చలతో సందడి చేయడానికి దారితీసింది, ఈ విచిత్రమైన బటన్‌ల ప్రాముఖ్యత మరియు అర్థానికి సంబంధించి వ్యక్తులు తమ ఆలోచనలు, ఊహాగానాలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ఇంటర్నెట్ మరియు మొబైల్ టెక్నాలజీ ప్రపంచంలో 'డౌన్‌లోడ్', 'అన్‌లాక్' మరియు 'సెర్చ్' వంటి పదాలు అంతర్భాగంగా  మారాయన్నది నిజం.  
 
హైదరాబాద్‌లోని ప్రజలు ఈ రహస్యం తెలుసుకోవటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అసాధారణమైన రీతిలో బటన్ల అమరిక ఉత్సుకతను రేకెత్తించింది. డిజిటల్ ప్రపంచం నుండి డిటాక్స్ చేయడానికి కొత్త మార్గం ఏదైనా వుంది అని దీని అర్థమా? హైదరాబాద్ యొక్క చమత్కార ప్రణాళిక ఆసక్తిని సృష్టించింది, సంభాషణలను రేకెత్తించింది. నగరం, దేశం మొత్తం మీద సాంకేతికత యొక్క భవిష్యత్తు గురించి ఊహాగానాలకు తెరతీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments