Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఏం జరుగుతుంది.. సర్వే రిపోర్ట్

Webdunia
గురువారం, 25 మే 2023 (11:04 IST)
వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఏం జరుగుతుందో సర్వే చెప్పేసింది. తెలుగుదేశం, జనసేన పొత్తులపై ఇరు పార్టీల నేతల్లోనూ క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశంతో పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తామంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ పొత్తుల వల్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ సర్వే నివేదికలు వెల్లడించాయి. అయితే పొత్తులో ఏ స్థానం ఎవరికి వెళుతుందనేది ఆసక్తి నెలకొంది. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేయడంతో పొత్తులపై పెద్ద చర్చే నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే ఐదు స్థానాల్లో అధిష్టానం సర్వే చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 
 
అందరూ ఊహించినట్టుగానే రెండు నియోజక వర్గాలపై అధిష్టానం దృష్టి పెట్టలేదు. జిల్లాలోని ఐదు నియోజక వర్గాల సర్వే నివేదికలు అధిష్టానం వద్దకు వెళ్లాయి. 
 
అందులో ఒక్క నియోజకవర్గంలోనే కాస్త పోటీ ఉంటుందంటూ సర్వేలో తేటతెల్లమైంది. టీడీపీ దృష్టి పెట్టిన ఇతర నాలుగు నియోజక వర్గాల్లో సునాయాస విజయం తధ్యమంటూ అధిష్టానం విశ్వసిస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments