సీఎం జగన్ తిరుపతి వస్తున్నారు.. మీ కార్లు జాగ్రత్త అంటూ దండోరా వేసిన జనసేన

Webdunia
ఆదివారం, 1 మే 2022 (22:38 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర పరువు గంగలో కలిసిపోతుంది. జగన్ రెడ్డి వైఖరికి తోటు అధికారుల అత్యుత్సాహం, అతి చేష్టలు రాష్ట్రం పరువును మరింతగా దిగజార్చుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఒంగోలు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళుతున్న భక్తుల కారును ఆపి ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైగా, భక్తులు బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీవో అధికారులు ట్రావెల్ కారును స్వాధీనం చేసుకున్నవార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇదిలావుంటే, ఈ నెలలో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు రానున్నారు. దీంతో జనసేన పార్టీ తిరుపతి విభాగం నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ తిరుపతి వస్తున్నారని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. 
 
జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు. సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments