Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ గీత దాటిన జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్!

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (16:34 IST)
కోడిపందాల బరి వద్ద జనసేన ఫ్లెక్సీలు కట్టి పార్టీ క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకు పాల్పడిన నేతలు జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడిపందాలు నిర్వహించారు. అయితే, ఈ కోడిపందాల బరి వద్ద పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా) పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. 
 
ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కోడి పందాల బరుల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరం. ఇందుకు బాధ్యుతలైన మిమ్మల్ని పార్టీ నుంచి  సస్పెండ్ చేస్తున్నాం అని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఇకపై, జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎలాంటి అధికారిక సంబంధం లేదు అని ముప్పా గోపాలకృష్ణకు పార్టీ స్పష్టం చేసింది. ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ నుంచి మధువరమే.. గీతం విడుదల

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ

రూ.వంద కోట్ల క్లబ్‌లో 'డాకు మహారాజ్' - 4 రోజుల్లో రూ.105 కోట్లు కలెక్షన్లు!!

రామ్ చ‌ర‌ణ్ RC 16లో నా లుక్ నాకెంతో సంతృప్తి క‌లిగింది: జ‌గ‌ప‌తి బాబు

Tabu: పెళ్లి అవసరం లేదు.. బెడ్‌ను పంచుకునేందుకు వ్యక్తి చాలు.. టబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments