Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు, ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (21:24 IST)
సంక్రాంతి ముగిసినా జల్లికట్టు మాత్రం చిత్తూరు జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఆచారంగా సాంప్రదాయ క్రీడను ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు గ్రామస్థులు. ఇప్పటికే 10కి పైగా గ్రామాల్లో జల్లికట్టును నిర్వహించారు. డిసెంబర్ 25వ తేదీ నుంచే జల్లికట్టు ప్రారంభమై ఈ నెల చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. 

 
కనుమ పండుగ సంధర్భంగా నిన్న నాలుగు గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. ఈ రోజు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి, మల్లయ్యపల్లి, డోర్నకంబాలలో జల్లికట్టు జరిగింది. కోడిగిత్తలకు కట్టిన బహుమతులను పొందేందుకు ప్రయత్నించిన యువకులకు గాయాలయ్యాయి.

 
సుమారు 20 మందికి పైగా యువకులకు గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కోడిగిత్తల తలకు కట్టిన బహుమతులను పొందేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో యువకులకు గాయాలయ్యాయి. 

 
పోలీసులు మొదట్లో ఆంక్షలు విధించారు. జల్లికట్టు ఆడకూడదని హెచ్చరించారు. ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. అయినా గ్రామస్తులు పట్టించుకోలేదు. జల్లికట్టును కొనసాగించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మూడు గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. వేలాదిమంది యువకులు జల్లికట్టును తిలకించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments