Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిట్ కాయిన్లు, ఆన్ లైన్ మోసాలకు సోషల్ మీడియా ల్యాబ్ తో చెక్

Advertiesment
బిట్ కాయిన్లు, ఆన్ లైన్ మోసాలకు సోషల్ మీడియా ల్యాబ్ తో చెక్
విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (18:48 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల నియంత్రణకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాదునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని డిజిపి గౌతం సవాంగ్ చెప్పారు.


మనిషి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైనది. కానీ, దానిని తమకు అనుకూలంగా మార్చుకొని కొంత మంది మోసగాళ్ళు అమాయకులను మోసగిస్తున్నారు. సాధారణ వ్యక్తి మొదలుకొని అత్యంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని సైతం వదలకుండా బురిడీ కొట్టిస్తూ అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.


ఉదాహరణకు లాటరీ మెయిల్స్, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు, సెల్ ఫోన్ల లావాదేవీలపై కన్ను, భద్రతా పరమైన నేరాలపై గోప్యత, ఒటిపి మోసాలు, కోవిడ్ టీకా సంబంధిత మోసాలు, ఆధార్ అనుసంధానం, భీమా సంస్థల పేరు తో మోసాలు, ప్రభుత్వ పధకాల పేర్లతో మోసాలు, బిట్ కాయిన్ మోసాలు, చిన్నారులు, మహిళలు, గృహిణుల పట్ల అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు, విచ్చలవిడిగా మర్ఫెడ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వంటి అనేక నేరాలకు పాల్పడుతున్నారు.


వీటన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఏపీ పోలీస్ సోషల్ మీడియా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా సైబర్ క్రైం విచారణ చేస్తామని డిజిపి సవాంగ్ తెలిపారు. నేరగాళ్ళని వెంటనే పట్టుకోడానికి ఈ ల్యాబ్స్ ఉపయోగపడతాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం - వైద్యులకు పాజిటివ్