Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి జగన్... అన్నీ ఎముకలు తగులుతున్నాయ్...? కసితో కండలు పెంచేసిన జగన్...

హైద‌రాబాద్ : ఆమధ్య వై.ఎస్. జ‌గ‌న్ బాగా బ‌క్క చిక్కిపోయారు. ఓదార్పు యాత్రలతో, ఆస్తుల కేసులతో కాస్త ఒత్తిడితో ముఖంలోనే ఎముక‌లు తేలే ప‌రిస్థితి అప్ప‌టిది. ఏడాదిన్న‌ర‌ క్రితం ఢిల్లీ వెళ్ళిన‌పుడు జ‌గ‌న్ భుజంపై చేయి వేసిన ఓ కేంద్ర నాయ‌కుడు... ఇదేంటి, అంతా

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (18:26 IST)
హైద‌రాబాద్ :  ఆమధ్య వై.ఎస్. జ‌గ‌న్ బాగా బ‌క్క చిక్కిపోయారు. ఓదార్పు యాత్రలతో, ఆస్తుల కేసులతో కాస్త ఒత్తిడితో ముఖంలోనే ఎముక‌లు తేలే ప‌రిస్థితి అప్ప‌టిది. ఏడాదిన్న‌ర‌ క్రితం ఢిల్లీ వెళ్ళిన‌పుడు జ‌గ‌న్ భుజంపై చేయి వేసిన ఓ కేంద్ర నాయ‌కుడు... ఇదేంటి, అంతా ఎముక‌లు త‌గులుతున్నాయి... అని ప్ర‌శ్నిస్తే... అంతా అయిపోయింది... ఏమీ లేదు కాకా... అని స‌మాధానం ఇచ్చార‌ట‌ జ‌గ‌న్.
 
కానీ, ఇపుడు సీన్ మారింది. జ‌గ‌న్ పూర్తిగా మారిపోయారు. బ్రిట‌న్‌లో రెండు వారాలు రిలాక్స్ అయిన జ‌గ‌న్... అక్క‌డ క‌స‌ర‌త్తులు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీ పార్టీ గురించి పొలిటిక‌ల్ క‌స‌ర‌త్తులు కావు. కండ‌లు పెంచేందుకు చేసే ఫిజిక‌ల్ ఎక్స‌ర్‌సైజులు. రోజులో ఎక్కువ సేపు జిమ్... త‌ర్వాత గోల్ప్ వంటి అవుట్‌డోర్ గేమ్స్... ఇక మాన‌సిక ఉల్లాసం, ఉత్తేజానికి చెస్ వంటి ఆట‌ల‌తో జ‌గ‌న్ పూర్తిగా మారిపోయారు. 
 
ఇపుడు ఆయ‌న దేహ‌దారుఢ్యం ఫుల్ ఫిట్ అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. మ‌నిషి కూడా చాలా ఉల్లాసంగా ఉన్నార‌ని, రాజ‌కీయ టెన్ష‌న్లు పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా, హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ పైన, బాడీ బిల్డింగ్ పైన దృష్టి పెట్టార‌ని అంటున్నారు. మొన్న కృష్ణా పుష్క‌రాల‌కు వ‌చ్చిన జ‌గ‌న్ మోహన్ రెడ్డిని చూస్తే, ఇది నిజ‌మే అనిపిస్తుంది. కండ‌లు తీరిన జ‌గ‌న్... ఇక పాలిటిక్స్‌లోనూ త్వ‌ర‌లో త‌న ప్ర‌తాపం చూపిస్తారా? ప్ర‌త్య‌ర్థుల‌తో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ‌తారా? వేచి చూడాలి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments