Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరడి బ్యారేజి నిర్మాణంలో సహకరించండి: ఒడిశా ముఖ్యమంత్రికి సీఎం వైయ‌స్ జగన్ లేఖ

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:07 IST)
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు నేరడి ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తమని, వంశధార నదిపై నిర్మించే ఆ ప్రాజెక్టుకు ఒడిశా సహకరించాలని ఏపీ సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు.

వంశధార నదీ వివాదాల ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం నేరడి బ్యారేజి నిర్మించుకునేందుకు అనుమతి ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించాలని సీఎం జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఈ సంద‌ర్భంగా లేఖ రాశారు.

ఏపీ, ఒడిశా మధ్య ఉన్న జల ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చూడాలని, ఇప్పటికే 80 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేరడి బ్యారేజి నిర్మాణం జరిగితే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒడిశాలోని గజపతి జిల్లాకు కూడా లబ్ది చేకూరుతుందని సీఎం జగన్ వివరించారు. ఈ ప్రాజెక్టు అంశంలో ఒడిశా ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments