ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (23:18 IST)
ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆయన ఆరోపించారు.
 
సోమవారం నాడు ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి ప్రసంగించారు.  ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. రెండు జాతీయ పతాకాలు ఉండడంపై కూడ ఆయన మాట్లాడారు.
 
భారత జాతీయ పతాకాన్ని దగ్దం చేయడం  జమ్మూలో నేరం ఎందుకు కాదని ఆయన ప్రశ్నించారు. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు ఉంటారా ఇది ఎక్కడ ఉండదన్నారు. 1947 నుండి  జమ్మూకాశ్మీర్ ప్రజలు ఈ విషయమై పోరాటం చేస్తున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.
 
370 ఆర్టికల్ రద్దు చేసి కేంద్రం మంచి నిర్ణయం తీసుకొందని  విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
 
కాశ్మీర్ సమస్యకు మోడీ సర్కార్ మంచి పరిష్కారాన్ని చూపారని  ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి ప్రకటించారు.  370 ఆర్టికల్ రద్దు చేయాలని  నిర్ణయం తీసుకొన్న మోడీకి  విజయసాయి రెడ్డి హ్యాట్సాప్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raashi Khanna: ఆయన ప్రతి మాటలో విలువ ఉంటుంది, మహేష్ బాబు తో కూడా నటించాలనుంది : రాశి ఖన్నా

Nabha Natesh: నాగబంధం శైలిలో నమో రే పాటకు క్లాసిక్ నృత్యతో ఆకట్టుకున్న నభా నటేష్ మరియు దక్ష నాగర్కర్

Harish Shankar: ఖుషికి కొనసాగింపు అనుకున్నాం కానీ కారణాలవల్ల ఉస్తాద్ కథ మార్చాం : హరీష్ శంకర్

PawanKalyan: నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం : పవన్ కళ్యాణ్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments